Hypersonic missile | హైపర్ సోనిక్ క్షీపణీ పరీక్ష విజయవంతం
Hypersonic missile | హైపర్ సోనిక్ క్షీపణీ పరీక్ష విజయవంతం
అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ సాధించిన దేశాల సరసన భారత్
Hyderabad : భరత ప్రభుత్వం హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్‌డీవో నేత్రుత్వంలో ఈ క్షిపణిని ఆదివారం ఉదయం విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇది 1500 కిలోమీటర్లకు మించిన వివిధ పే లోడ్లను సునాయాసంగా లక్ష్యానికి తీసుకెళ్లగలదు. దీని ప్రాధాన్యతల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలు రాయిని దాటిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా స్థానం సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు.
* * *
Leave A Comment